Covid19 Masks Must : కరోనా భూతం మాస్క్ లు అవసరం
మరోసారి భయ పెడుతున్న భూతం
Covid19 Masks Must : చైనాలో కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. మరోసారి కరోనా ముప్పు భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ లు విధిగా మాస్క్ లు ధరించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు వీరిద్దరూ. అదేమిటంటే ఇక నుంచి లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు విధిగా మాస్క్ లు ధరించాలని లేక పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని స్పష్టం చేశారు.
దీంతో కరోనా మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకు చైనాలో కేసుల పెరుగుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గడం లేదు. దీంతో గురువారం జరిగిన లోక్ సభ, రాజ్య సభ సమావేశాలలో ప్రతి ఒక్కరు మాస్క్ ను ధరించడం(Covid19 Masks Must) ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా సమావేశాలు ప్రారంభం కాగానే లోక్ సభ స్పీకర్ పార్లమెంటేరియన్లు మాస్క్ లు ధరించాలని సూచించారు. కోవిడ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎందరినో కోల్పోయాం. గతంలో మనకు చాలా అనుభవం వచ్చింది. దానిని పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరు దూరం పాటించాలని పేర్కొన్నారు స్పీకర్ .
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరోసారి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది.
Also Read : కదం తొక్కిన లింగాయత్‌లు