Nithiin: దుబాయ్‌లో ప్రారంభమైన నితిన్ @ 30 మువీ
Nithiin: నితిన్ హీరోగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తయారవుతున్నఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ దుబాయ్‌లో మొదలైంది.
Nithiin: నితిన్ హీరోగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తయారవుతున్నఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ దుబాయ్‌లో మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం హీరో హీరోయిన్లు నితిన్, నభా నటేష్‌పై లవ్ సన్నివేశాలు చిత్రీకరణతో ఫిల్మ్ షూటింగ్ మొదలైంది. విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన నితిన్, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు. తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొననున్నారని దర్శకుడు చెప్పారు.

No comment allowed please