CM Yogi Adityanath : జీ20 సదస్సులో యూపీ సత్తా చాటాలి
పిలుపునిచ్చిన సీఎం యోగి ఆదిత్యానాథ్
CM Yogi Adityanath : ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత దేశం ప్రపంచాన్ని విస్మయ పరిచేలా ముందుకు సాగుతోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇదే సమయంలో భారత్ జీ20 శిఖరాగ్ర సదస్సుకు నాయకత్వం వహిస్తోంది. ఇది ఒక రకంగా భారత నాయకత్వానికి లభించిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు సీఎం.
ఇదే సమయంలో యూపీనీ ప్రపంచ వేదికపై ప్రవేశ పెట్టేందుకు జీ20 సదస్సు అవకాశం కల్పిస్తుందని అన్నారు యోగి. జనవరి 22 ఆదివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. లక్నోలో జరిగిన ఈ మీటింగ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్రానికి చెందిన 700 మందికి పైగా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. రాబోయే కార్యాచరణ ప్లాన్ పై చర్చ చేపట్టారు. ఇప్పటి వరకు చేసిన పనులపై సమీక్షించారు. రాజకీయ తీర్మానం కూడా ఆమోదించింది కార్యవర్గం. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adityanath) ప్రసంగించారు. మోడీ అన్న పదం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోందన్నారు.
భారత దేశం ఈ ఏడాది జీ20 సమ్మిట్ ను నిర్వహిస్తోంది. యూపీలోని నాలుగు నగరాల్లో లక్నో, ఆగ్రా ,వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ లలో 11 ఈవెంట్ లు జరగనున్నాయని తెలిపారు. వీటిని నిర్వహించడం వల్ల యూపీ సంస్కృతి ఏమిటో తెలియ చెప్పేందుకు మనకు అవకాశం లభిస్తుందని చెప్పారు యోగి ఆదిత్యానాథ్.
వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు , కంపెనీలకు యూపీ కేరాఫ్ గా మారిందన్నారు. వీటి ఏర్పాటు వల్ల ఉపాధి లభిస్తుందని చెప్పారు సీఎం.
Also Read : రాజ్యాంగాన్ని సుప్రీం హైజాక్ చేస్తోంది