AP Govt Clarifies : అవన్నీ అబద్దాలు సకాలంలో జీతాలు
స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AP Govt Clarifies : జీతాలు చెల్లించడం లేదని, ఆలస్యంగా ఇస్తున్నారంటూ పనిగట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం. ఇదంతా కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది(AP Govt Clarifies). ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఇందులో భాగంగా తాము ఏయే తేదీల్లో ఏయే విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తున్నామనే దానిపై వివరాలతో వెల్లడించింది. కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా తెలిపింది ఏపీ సర్కార్. ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని కొట్టి పారేసింది. ఉద్యోగులు తమ ఇంటి సభ్యులని, వారి ఆనందం తమ సంతోషమని పేర్కొంది.
అంతే కాకుండా ఠంఛనుగా ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే చూసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడింది.
రాష్ట్రంలో పని చేస్తున్న అన్ని విభాగాలు, శాఖలలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ 95 శాతం మందికి ప్రతి నెలా 5వ తేదీ లోపు వేతనాలను వారి ఖాతాలలో జమ చేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ(AP Govt Clarifies) కుండ బద్దలు కొట్టింది.
దేశంలో కరోనా కారణంగా ఉద్యోగులకు జీతాలు నిలిపి వేస్తే సీఎం జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలోని ఉద్యోగులకు ఒక్క పైసా ఆపలేదని వెల్లడించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
కేవలం ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : పవన్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు