Deputy Tahsildar : డిప్యూటీ త‌హ‌శీల్దార్ ఆనంద్ రెడ్డిపై వేటు

స్మితా ఇంట్లోకి అక్ర‌మంగా చొర‌బాటు

Deputy Tahsildar : తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో కీల‌క పోస్టులో కొన‌సాగుతున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్ నివాసంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నం చేసిన డిప్యూటీ త‌హ‌శీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి(Deputy Tahsildar)పై వేటు ప‌డింది. ఈ మేర‌కు ఆయ‌న‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని సోమ‌వారం అధికారికంగా వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే ఇంట్లోకి చొర‌బ‌డిన విష‌యాన్ని స్వ‌యంగా స్మితా స‌బ‌ర్వాల్ వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. ఆనంద్ కుమార్ రెడ్డితో పాటు అత‌డి వెంట ఉన్న మ‌రొక‌ర‌ని అరెస్ట్ చేశారు. చంచ‌ల్ గూడ జైలుకు పంపించారు. తాజాగా జిల్లా క‌లెక్ట‌ర్ జారీ చేసిన ఉత్త‌ర్వుల కాపీని జైలులో ఉన్న డిప్యూటీ త‌హ‌శీల్దార్ కు(Deputy Tahsildar) అంద‌జేస్తారు.

హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉంటున్నారు స్మితా స‌బ‌ర్వాల్. మేడ్చ‌ల్ జిల్లాలో డిప్యూటీ త‌హ‌శీల్దార్ చొర‌బ‌డ్డారు. ఈ విష‌యం స్మిత చెప్పేంత దాకా ఎవ‌రికీ తెలియ‌దు. ఎంతో సెక్యూరిటీ ఉండే ఆమె ఇంట్లోకి ఆనంద్ కుమార్ రెడ్డి ఎలా చొర‌బ‌డ్డాడు అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగా మారింది.

దేని కోసం వెళ్లాడు..రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో ఎందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌నే దానిపై ప‌లు ప్ర‌శ్న‌లు నెల‌కొన్నాయి. ఇదిలా ఉండ‌గా ఇంట్లోకి చొర‌బ‌డిన ఆనంద్ కుమార్ రెడ్డిని చూసి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు స్మితా స‌బ‌ర్వాల్. ఆ త‌ర్వాత అత‌డిని చూసి కేక‌లు వేశారు. సెక్యూరిటీ సిబ్బంది అప్ర‌మ‌త్తం కావ‌డం, వెంట‌నే ప‌ట్టుకోవ‌డం జ‌రిగింది. ఇది సినిమాలోని క‌థ లాగా ఉంది. ఇక ఆ వెంట‌నే ట్వీట్ చేసింది స్మితా స‌బ‌ర్వాల్. రాత్రి పూట జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

Also Read : అవన్నీ అబ‌ద్దాలు స‌కాలంలో జీతాలు

Leave A Reply

Your Email Id will not be published!