AAP Supreme Court : ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆప్ కోర్టుకు
చర్చకు రావాలని సీఎంకు ఎల్జీ పిలుపు
AAP Supreme Court : ఢిల్లీ బల్దియా మేయర్ , నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారం సవ్యంగా జరగనీయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎల్జీ సక్సేనా కలిసి ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ఆప్ ఆరోపించింది.
ఇదిలా ఉండగా ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబేరాయ్ , ఆప్ నేత ముఖేష్ గోయల్ మేయర్ పదవికి వెంటనే ఎన్నికలు జరుపాలని కోరారు. అంతే కాకుండా నామినేటెడ్ కౌన్సిలర్లకు ఓటు వేసే హక్కు లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ మేయర్ ఎన్నికల కోసం ఆప్ రెండు అభ్యర్థనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారతీయ జనతా పార్టీ ఆరోపించిన చట్ట విరుద్ద ప్రయత్నాలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పౌర సంఘాల అత్యున్నత పదవికి ఎన్నికలను సమయ నిర్ణీత పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి ఒబేరాయ్ పార్టీ తరపున భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు(AAP Supreme Court).
శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది కోర్టు. 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లకు ఓటు వేయకుండా చట్టాన్ని అనుసరించాలని కూడా పార్టీ వాదించింది. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సిట్టింగ్ లో గందరగోళం మధ్య ఈ నెలలో రెండోసారి మేయర్ ఎన్నిక నిలిచి పోయింది. దీంతో ఆప్ భారతీయ జనతా పార్టీ పై సీరియస్ కామెంట్స్ చేసింది.
Also Read : తప్పుడు లెక్కల్లో అదానీ గ్రూప్ టాప్