CM Bommai Swami : ‘స్వామి’ నుంచి మైక్ లాక్కున్న సీఎం
సర్కార్ పై ఈశ్వరానందపురి ఫైర్
CM Bommai Swami : ఓ స్వామీజీ మాట్లాడుతుండగా స్టేజి పైనే అంతా చూస్తుండగానే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఊహించని విధంగా మైక్ లాక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే బొమ్మై సర్కార్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో ఈశ్వరానంద స్వామి వేదికపైనే ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తట్టుకోలేక సీఎం మైకు లాక్కున్నారు.
ఇది చర్చకు దారి తీస్తోంది. ఇటీవల బెంగళూరులో వర్ష ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టారు. వేదికపై ఈశ్వరానందపురి స్వామి, కర్ణాటక సీఎం ఆశీసునులయ్యారు. స్వామి, సీఎం(CM Bommai Swami) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆయన వేసిన ప్రశ్నలకు సీఎం బొమ్మై సమాధానం ఇచ్చారు. మరో వైపు ఈశ్వరానందపురి స్వామి మాట్లాడుతుండగానే బొమ్మై మైకు లాక్కోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్వామి మాట్లాడుతూ బెంగళూరులో భారీ గా వర్షాలు కురుస్తున్నాయని కానీ ప్రజా ప్రతినిధులు , బీబీఎంసీ అధికారులు వెళుతుంటారని కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం కనుక్కోవడం లేదంటూ ఆరోపించారు.
ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీశారు సీఎం బొమ్మైని. తాను ఇప్పటికే హామీ ఇచ్చానని, నిధులు కూడా మంజూరు చేశానని, తాను మాటల సీఎంను కాదని చేతల సీఎం నంటూ స్పష్టం చేశారు బస్వరాజ్ బొమ్మై. ఇదిలా ఉండగా కర్నాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఘటనపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం తన పదవి పోతుందనే భయంతో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
Also Read : మోడీ పోటీపై తమిళనాడులో చర్చ