Pathan Collections : కోట్లు కొల్ల‌గొడుతున్న ప‌ఠాన్

బాక్సులు బ‌ద్ద‌లు కోట్లే కోట్లు

Pathan Collections : షారుఖ్ ఖాన్ , దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ చిత్రం భారీ ఎత్తున క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచి నేటి దాకా వివాదానికి గురైంది. దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల అభ్యంత‌ర‌క‌ర‌మైన సీన్లు ఉన్నాయ‌ని, బేష‌ర‌మ్ సాంగ్ హిందూ భావాల‌ను కించ ప‌రిచేలా చిత్రీక‌రించారంటూ హిందూ వాద సంస్థ‌లు భారీ ఎత్తున నిర‌స‌న తెలిపాయి.

బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రి సైతం వార్నింగ్ ఇచ్చారు. చివ‌ర‌కు అస్సాం సీఎం సైతం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఏది ఏమైనా ఓ వైపు నిర‌స‌నల మ‌ధ్య విడుద‌లైన ప‌ఠాన్ ఊహించ‌ని రీతిలో భారీ క‌లెక్ష‌న్లు(Pathan Collections) కొల్ల‌గొట్టింది. మొద‌టి రోజు 100 కోట్లు వ‌సూలు చేస్తే రెండో రోజు 231 కోట్ల‌ను దాటేసింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా స‌క్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది. బాద్ షా తో పాటు దీపికా ప‌దుకొనే , జాన్ అబ్ర‌హం క‌లిసి న‌టించిన ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ , రొమాంటిక్ , థ్రిల్ల‌ర్ తో రూపొందించారు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉండ‌గా వారం రోజుల్లోపే రూ. 600 కోట్ల‌ను దాటే ఛాన్స్ ఉంద‌ని సినీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయ‌.

ప‌ఠాన్ మూవీ జ‌న‌వ‌రి 25న విడుద‌లైంది ప్ర‌పంచ వ్యాప్తంగా. చిత్రానికి సిద్దార్థ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌ఠాన్ ను యష్ రాజ్ ఫిల్మ్స్ , ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు భారీ ఎత్తున క‌లెక్ష‌న్లు(Pathan Collections) కొల్ల‌గొడుతున్నాయి. ఈ త‌రుణంలో బాలీవుడ్ బాద్ షా సినిమా స‌క్సెస్ కావ‌డంతో ఫుల్ జోష్ లో ఉంది మూవీ టీం.

Also Read : తార‌క‌ర‌త్న ఆరోగ్యం ప‌దిలం

Leave A Reply

Your Email Id will not be published!