Raja J Chari : వ్యోమగామి రాజా చారికి అరుదైన గౌరవం
యుఎస్ వైమానిక దళంలో చోటు
Raja J Chari : భారత దేశంలోని తెలంగాణ ప్రాంతానికి చెందన భారతీయ, అమెరికన్ వ్యోమగామి రాజా జే చారికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా దేశంలోని అత్యున్నత పదవి ఆయనను వరించింది. యుఎస్ వైమానిక దళంలో కీలక పోస్టులో కొలువుతీరారు. ఈ విషయాన్ని స్వయంగా యుఎస్ ప్రభుత్వం వెల్లడించింది.
అధికారికంగా కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికా వైమానిక దళంలో బ్రిగేడియర్ జనరల్ హోదాకు రాజా కె చారి నామినేట్ అయ్యారు. ఆయనను యుఎస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ సంతకం చేశారు. బ్రిగేడియర్ జనరల్ వన్ స్టార్ జనరల్ ర్యాంక్ కావడం విశేషం.
ఇది మేజర్ జనరల్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్నత స్థాయి సిబ్బంది స్థాయి అధికారి పోస్ట్ . భారత సంతతికి చెందిన యుఎస్ వ్యోమగామి , యుఎస్ ఎయిర్ ఫోర్స్ సభ్యుడు రాజా జె చారిగా(Raja J Chari) ఉన్నారు. యుఎస్ వైమానిక దళంలో కీలక పాత్రకు నామినేట్ కావడంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
అమెరికా వైమానిక దళంలో బ్రిగేడియర్ జనరల్ హోదాకు అధ్యక్షుడు జో బైడన్ నామినేట్ చేయడంతో సంతోషానికి లోనయ్యారు రాజా జే చారి. ఇదిలా ఉండగా నామినేషన్ ధృవీకరించేందుకు ముందు యుఎస్ సెనేట్ ఆమోదం పొందాలి. బ్రిగేడియర్ జనరల్ వన్ స్టార్ జనరల్ ర్యాంక్.
ఇది మేజర్ జనరల్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్నత స్థాయి అధికారిగా తనను నియమించినందుకు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు రాజా జే చారి(Raja J Chari) .
Also Read : హిండెన్‌బర్గ్ కథేంటి ఆండర్సన్ ఎవరు