Priyanka Gandhi Rahul Yatra : రాహుల్ యాత్రలో ప్రియాంక
సోదరుడితో జత కట్టిన సోదరి
Priyanka Gandhi Rahul Yatra : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం కాశ్మీర్ లో కొనసాగుతోంది. నిన్న భద్రతా లోపం కారణంగా యాత్రకు ఆటంకం ఏర్పడింది. దీనిపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ స్వయంగా. ఈ మేరకు సెక్యూరిటీని పునరుద్దరించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, ప్రధానికి లేఖ రాయడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా ఎలాంటి సెక్యూరిటీ లోపం లేదని జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇవాళ కొనసాగుతున్న జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పాల్గొన్నారు. అంతకు ముందు దేశం కోసం మరణించిన అమరులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
సోదరుడితో కలిసి ప్రియాంక అడుగులో అడుగులు వేశారు. అంతకు ముందు మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తో పాటు ఆమె కూతురు పాల్గొన్నారు. మరో వైపు భారీ భద్రత మధ్య రాహుల్ , ప్రియాంక గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లేత్ పోరా వద్ద రాత్రి బస చేసే అవకాశం ఉంది. కాగా భారత్ జోడో యాత్ర జనవరి 30తో ముగుస్తుంది.
31న 24 పార్టీలతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు కానుంది. ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగనుంది. గత ఏడాది 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. కల్లోల కాశ్మీరంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : రాహుల్ యాత్రలో ‘ముఫ్తీ’