Srisailam Mahashivratri : 11 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ
Srisailam Mahashivratri : భక్తులకు స్వర్గ ధామంగా విరాజిల్లుతోంది ఏపీలో కొలువు తీరిన శ్రీశైల మల్లన్న పుణ్య క్షేత్రం. రోజూ వేలాది మంది స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటారు. మహా శివరాత్రి(Srisailam Mahashivratri) పర్వదినం పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించింది.
ఈ మేరకు ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీ మునిగి పోయింది. ప్రధానంగా ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. చాలా మంది శివ మాలలు ధరిస్తారు. ఈ పుణ్య క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరొందింది. అష్టాదశ పీఠాల్లోనూ ఒకటిగా వినుతికెక్కింది.
10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. 11 నుంచి 21 దాకా కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజూ జరిగే అన్ని ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే శివ మాలధారులు, భక్తులు తండోప తండాలుగా శ్రీశైల క్షేత్రానికి పోటెత్తారు.
మరో వైపు ముందస్తుగా ఈనెల 7 నుంచి 21 దాకా ఆలయంలో భక్తులకు సర్వ దర్శన ప్రవేశాన్ని రద్దు చేసింది శ్రీశైలం దేవస్థానం కమిటీ. 14న టీటీడీ తరపున, 15న రాష్ట్ర సర్కార్ తరపున మల్లికార్జున స్వామి, పార్వతి దేవికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు(Srisailam Mahashivratri).
అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు 820కి పైగా బస్సులు నడపనున్నారు. ఉత్సవాలకు 8 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఆలయ కమిటీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది.
Also Read : రిషికేశ్ ఆశ్రమంలో విరాట్..అనుష్క