Surya Kumar Yadav : ద‌మ్ముంటే చాలు ఏ పిచ్ అయితేనేం

స్టార్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్

Surya Kumar Yadav : భార‌త క్రికెట్ లో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క్రికెట్ లో మోస్ట్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్ గా పేరు పొందాడు. ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాడు.

బంతులు ఎలా వేసినా ఫోర్లు, సిక్స‌ర్లు కొడుతూ విస్తు పోయేలా చేస్తున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు సూర్య భాయ్. ఒక క్రికెట‌ర్ ఇలా కూడా ఆడ‌తాడ‌ని తాము క‌ల‌లో కూడా అనుకోలేదంటూ దాయాది పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్లు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారంటే మ‌నోడి స్టామినా ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదిలా ఉండ‌గా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స్వ‌దేశంలో న్యూజిలాండ్ జ‌ట్టుతో ఆఖ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ లో విజ‌యం సాధించాయి. మోదీ స్టేడియంలో నువ్వా నేనా అనే రీతిలో త‌ల‌ప‌డ‌నున్నాయి. టీ20 సీరీస్ ను నిర్ణ‌యించే కీల‌క మ్యాచ్ లో మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చాటాల‌ని త‌హ త‌హ లాడుతున్నాడు సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav).

ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ స్కోర్ కే ప‌రిమితం చేసినా చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు కూడా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క‌మైన పాత్ర పోషించ‌డంతో భార‌త్ గ‌ట్టెక్కింది.

ఈ త‌రుణంలో కీల‌క మ్యాచ్ లో తాను స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌న్నాడు సూర్య భాయ్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆట‌గాళ్లలో దమ్ముంటే చాలు పిచ్ లు ఎలా ఉంటే ఏం అని ప్ర‌శ్నించాడు.

Also Read : అజ్జూ భాయ్ పై హైకోర్టులో దావా

Leave A Reply

Your Email Id will not be published!