Arshad Ayub Azharuddin : అజ్జూ భాయ్ పై హైకోర్టులో దావా
ఎన్నికలు నిర్వహించకుండా కుట్ర
Arshad Ayub Azharuddin : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇద్దరూ ఒకప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారే. వారిలో ఒకరు అర్షద్ అయూబ్ కాగా మరొకరు మహ్మద్ అజహరుద్దీన్ . అజ్జూ భాయ్ కెప్టెన్ గా మోస్ట్ పాపులర్. అంతే కాదు బ్యాటర్ గా కూడా పేరొందారు.
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం గనుక లేక పోయి ఉండి ఉంటే ఇవాళ బీసీసీఐకి చీఫ్ గా ఉండేవాడు. ఇది కోరి తెచ్చుకున్న వివాదం. అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఉన్నాడు. హెచ్సీఏ కు ఎన్నికలు జరపకుండా అజ్జూ భాయ్ అడ్డు పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్(Arshad Ayub).
ఈ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. కావాలని అజహరుద్దీన్ అడ్డుకుంటున్నాడని వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరారు అయూబ్ పిటిషన్ లో. ఈ పిటిషన్ పై కే. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వాదించారు.
2021 జూలై నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ అజహరుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతా తానై వ్యవహరిస్తున్నాడని, ఒక రకంగా మోనార్క్ లాగా మారాడని పేర్కొన్నారు. సర్వ సభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా దానిని చేపట్టకుండా అజహరుద్దీన్ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందని జస్టిస్ కుక్రూను నియమించిందని, అయినా వంకా ప్రతాప్ తో కలిసి అజ్జూ భాయ్ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా ఎంత