TS Assembly 2023 : అభివృద్ది పథం తెలంగాణ రాష్ట్రం
దేశానికి ఆదర్శ రాష్ట్రంగా పురోగమిస్తోంది
TS Assembly 2023 : అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకు పోతోందని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. మౌలిక వసతుల కల్పనలో, వనరులను వినియోగించు కోవడంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు.
శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు(TS Assembly 2023) ప్రారంభం అయ్యాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. ప్రతి రంగంలో తనదైన ముద్ర కనబరుస్తోందని అన్నారు. ప్రజల సహకారం , కేసీఆర్ పాలనా దక్షత వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు తమిళి సై సౌందర రాజన్.
ఉభయ సభలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్. ఒకనాడు విద్యుత్ కోతతో సతమతమైన తెలంగాణ ఇవాళ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుందన్నారు. ఇతర రాష్ట్రాలకు కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్రాంతంగా వినుతి కెక్కిందన్నారు గవర్నర్.
ఒకనాడు నీటి కొరతతో కరవు ప్రాంతంగా పేరొందిన తెలంగాణ ఇవాళ వ్యవసాయ రంగంలో టాప్ లో నిలిచిందన్నారు. తెలంగాణ ధాన్యాగారంగా మారి పోయిందని , ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు తమిళి సై సౌందర రాజన్. ప్రతి గ్రామానికి ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తోందని అన్నారు.
ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు గవర్నర్. పెట్టుబడులకు స్వర్గ ధామంగా , ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్య స్థానంగా , ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా అభివృద్ది పథంలో దూసుకు పోతోందన్నారు తమిళి సై సౌందర రాజన్.
Also Read : లిక్కర్ స్కాంలో కవిత..కేజ్రీవాల్