Hello Hong Kong : టూరిస్టుల కోసం భ‌లే ఛాన్స్

హాంకాంగ్ బంప‌ర్ ఆఫర్

Hello Hong Kong : హాంకాంగ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌ర్యాట‌క రంగానికి ఊతం ఇచ్చేలా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఏకంగా 5 ల‌క్ష‌ల మంది టూరిస్టుల‌కు ఉచితంగా త‌మ దేశంలో ప‌ర్య‌టించేందుకు వీలు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇందు కోసం హ‌లో హాంగ్ కాంగ్(Hello Hong Kong) పేరుతో స్పెష‌ల్ క్యాంపెయిన్ కు శ్రీ‌కారం చుట్టింది.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ. ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ దేశమూ టూరిస్టుల కోసం ఉచిత ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ లేద‌ని స్పష్టం చేశారు. హాంకాంగ్ కు చెందిన 3 ఎయిర్ లైన్స్ కంపెనీలు క‌లిసి ఈ ప‌ర్యాట‌క ఫ్రీ ప్యాకేజీ స్కీంను రూపొందించాయి.

ఈ ఉచిత ప‌థ‌కం మార్చి నుంచి ఆగ‌స్టు దాకా అంటే 6 నెల‌ల పాటు అమ‌లులో ఉంటుంది. ఇంఉలో భాగంగా మొత్తం 5 ల‌క్ష‌ల టికెట్ల‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు జాన్ లీ. ప‌ర్యాటకుల‌ను ఆక‌ర్షించేందుకు ఈ విమాన‌యాన సంస్థ‌లు ఏకంగా రూ. 2 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డం విశేషం.

ఇందులో మ‌రో మ‌త‌ల‌బు కూడా ఉంది. ఒక‌రికి టికెట్ ఉచితంగా ఇస్తే వారు ఒక‌రు లేదా ఇద్ద‌రిని హాంకాంగ్ కు(Hello Hong Kong) తీసుకు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నాయి ఎయిర్ లైన్స్ లు. దాదాపు 15 ల‌క్ష‌ల మందికి పైగా ప‌ర్యాట‌కులు త‌మ దేశాన్ని సంద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నాయి.

టూరిస్టుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.ల‌క్కీ డ్రాలు, ఆట‌ల‌లో గెలుపొందిన వారికి కూడా ఉచితంగా టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు జాన్ లీ.

Also Read : బైజూస్ లో భారీగా ఉద్యోగుల‌ తొల‌గింపు

Leave A Reply

Your Email Id will not be published!