AP CM YS Jagan : ఇక నుంచి ‘జ‌గ‌న‌న్న‌కు చెబుదాం’

కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం

AP CM YS Jagan : ఏపీ సీఎం రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. త్వ‌ర‌లో జ‌గ‌న‌న్న‌కు చెబుదాం అనే పేరుతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసు కునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) స‌మీక్ష‌లు చేప‌డుతూ వ‌స్తున్నారు. కొత్త‌గా ఇన్ ఛార్జ్ ల‌ను నియ‌మించారు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంత్రులు, పార్టీ బాధ్య‌తులతో పాటు జిల్లా పార్టీల అధ్య‌క్షుల‌కు టార్గెట్ నిర్దేశించారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఉద‌యమే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గ్రామాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తోంది. అక్క‌డిక‌క్క‌డే ప్ర‌జ‌లతో మాట్లాడ‌టం, స‌మ‌స్య‌ల‌ను విన‌డం చేస్తున్నారు. సంబంధిత శాఖ‌ల అధికారులు కూడా ఎమ్మెల్యేల వెంట ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌గా ప‌రిష్కారం ల‌భిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

జ‌గ‌న‌న్న‌కు చెబుదాం అనే కార్య‌క్ర‌మం ద్వారా ఎవ‌రైనా నేరుగా సీఎంతో త‌మ స‌మ‌స్య‌ను వినిపించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి సోమ‌వారం కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ఏయే స‌మ‌స్య‌లు ఉన్నాయో వాటిని న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Also Read : జ‌న‌వ‌రి నెల‌లో శ్రీవారికి భారీ ఆదాయం

Leave A Reply

Your Email Id will not be published!