Supreme Court Modi Govt : మోదీ సర్కార్ పై సుప్రీం సీరియస్
న్యాయమూర్తుల ఎంపికలో జాప్యం
Supreme Court Modi Govt : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మధ్య భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టుకు(Supreme Court) మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొలీజియం వ్యవస్థ సక్రమంగా లేదంటూ కేంద్రం ఆరోపిస్తోంది. ప్రత్యేకించి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఒక రకంగా ప్రభుత్వమే సుప్రీం అనే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. చివరకు నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో బాంబే హైకోర్టులో కేంద్ర మంత్రి రిజిజు, ఉప రాష్ట్రపతి పై బాంబే లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఆ ఇద్దరూ భారత రాజ్యాంగాన్ని అవమానించారంటూ ఆరోపించింది. వెంటనే పదవుల్లో ఉండేందుకు అర్హులు కారంటూ పిటిషన్ లో పేర్కొంది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక , పదోన్నతులు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా కావాలని తాత్సారం చేస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు(Supreme Court).
దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ మేరకు మూడు నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులను నియమిస్తామని సర్వోన్నత న్యాయ స్థానానికి తెలిపింది.పెండింగ్ లో ఉన్న వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామంటూ ప్రకటించింది. అయినా జాప్యం జరగడంపై మండిపడింది.
న్యాయమూర్తులు ఎస్కే కౌల్ , ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు జడ్జీల బదిలీకి సంబంధించిన సిఫార్సులను క్లియర్ చేయడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read : దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధులు