Dharmendra Pradhan : క‌ర్ణాట‌క బీజేపీ ఇన్ ఛార్జ్ గా ప్ర‌ధాన్

నియ‌మించిన బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

Dharmendra Pradhan : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాదిలో శాస‌న స‌భకు సంబంధించి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కార్ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు.

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో చ‌తుర్ముఖ పోటీ జ‌ర‌గ‌నుంది. బీజేపీ, కాంగ్రెస్ , జేడీయూ, బీఆర్ఎస్ బ‌రిలో ఉండ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా జేపీ న‌డ్డా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు.

ఈ మేర‌కు హైక‌మాండ్ క‌ర్ణాట‌క రాష్ట్రానికి సంబంధించి ఎన్నిక‌ల ఇన్ ఛార్జ్ గా కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్(Dharmendra Pradhan) ను నియ‌మించింది. ఆయ‌న‌కు స‌పోర్ట్ గా త‌మిళ‌నాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామ‌లైకి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కీల‌క పాత్ర పోషించారు. వ్యూహాలు ప‌న్న‌డంలో , పార్టీని విజ‌య ప‌థంలో తీసుకు పోవ‌డంలో కీల‌కంగా మార‌నున్నారు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్.

ఆయ‌న‌కు ద‌క్షిణాదిలో మంచి ప‌ట్టుంద‌ని బీజేపీ హైక‌మాండ్ భావించింది. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై క‌ర్ణాట‌క‌లో ఎస్పీగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రాజీనామా చేసి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క‌మైన పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం అన్నామలై మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా ఎదిగారు. ఎలాగూ బీఎల్ సంతోష్ కూడా క‌ర్ణాట‌క‌కు చెందిన వారు కావ‌డం విశేషం.

Also Read : మోదీ స‌ర్కార్ పై సుప్రీం సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!