India Ban Chinese Apps : చైనాకు షాక్ యాప్స్ పై నిషేధం
కోలుకోలేని ఝలక్ ఇచ్చిన కేంద్రం
India Ban Chinese Apps : భారత్ తో చీటికి మాటికి గిల్లి కజ్జాలకు దిగుతూ ప్రేరేపిస్తున్న చైనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తూ వస్తోంది భారత్. ఆ దేశపు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే దిశగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశానికి చెందిన వస్తువులు ఇవాళ భారత్ నే కాదు యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
మొత్తం చైనాపై ఆధారపడేలా చేసింది. ఉత్పత్తికి సంబంధించిన అన్ని కూడా ప్రస్తుతం చైనాలో తయారవుతున్నాయి. ఇదిలా ఉండగా భారత్ ను కనెక్టివిటీ ద్వారా దెబ్బ కొడుతోంది చైనా. ఆ దేశానికి చెందిన పలు యాప్ లు భారత్ ను ముంచెత్తుతున్నాయి. అంతే కాదు మొబైల్స్ కూడా. ప్రతి ఇండియన్ చేతిలో ప్రస్తుతం చైనాకు చెందిన ఫోన్లు ఉన్నాయి.
వీటిని అరికట్టేందుకు భారత్ మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళుతోంది. తాజాగా చైనాకు చెందిన దేశ సమగ్రతకు విఘాతం కలిగించే హానికరమైన యాప్ లపై ఫోకస్ పెట్టింది కేంద్ర సర్కార్. ఈ మేరకు చైనాతో సంబంధం కలిగి ఉన్న 138 బెట్టింగ్ యాప్ లతో పాటు 94 లోన్ లెండింగ్ యాప్స్ పై మోదీ ప్రభుత్వం నిషేధం(India Ban Chinese Apps) విధించింది.
ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం పలు ప్రమాదకర యాప్ లను నిషేధించింది.
Also Read : ప్రపంచ స్టార్టప్ లలో 3వ స్థానంలో భారత్