Adani Row : అదానీ అవకతవకలపై చర్చించాలి
ప్రతిపక్షాల డిమాండ్..పార్లమెంట్ వాయిదా
Adani Row : అదానీ గ్రూప్ లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం గురించి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన కామెంట్స్ చేసింది. తీవ్ర అవకతవకలకు పాల్పడుతోందని , ఇన్వెష్టర్లు పెట్టుబడి పెట్టవద్దంటూ కోరింది. దీని దెబ్బకు ఉన్నట్టుండి షేర్లు భారీగా పడి పోయాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అదానీ గ్రూప్ పై చోటు చేసుకున్న వ్యవహారంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
సోమవారం 16 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశం అయ్యారు. ప్రధానంగా అదానీ గ్రూప్ వ్యవహారంపై చర్చ తప్పక జరగాలని ఎంపీలు కోరారు. నిన్నటి దాకా అదానీని(Adani Row) వెనకేసుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఒకరకంగా నిలదీశారు. కానీ మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు.
సర్కార్ ఒప్పుకోక పోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఇప్పటికే భారత రాష్ట్ర సమితి , ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు బహిష్కరించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. ఒక రకంగా భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచినట్టేనని పేర్కొంది.
ప్రధానంగా ఎల్ఐసీ, ఎస్బీఐకి చెందిన డబ్బులను భారీ ఎత్తున అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టారని దీనికి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
Also Read : బీజేపీపై భగ్గుమన్న శశి థరూర్