Manik Sarkar : కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాలి – స‌ర్కార్

మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్

Manik Sarkar : త్రిపుర మాజీ ముఖ్య‌మంత్రి మాణిక్ స‌ర్కార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్ నాయ‌క‌త్వం కోసం కొత్త వారికి చోటు క‌ల్పించాల‌ని సూచించారు. 60 మంది స‌భ్యులు క‌లిగిన త్రిపుర అసెంబ్లీకి ఫిబ్ర‌వ‌రి 16న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అధికారాన్ని నిల‌బెట్టు కోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ భావిస్తోంది.

ఇదిలా ఉండ‌గా సీపీఎం అగ్ర నాయ‌కుడు మాణిక్ స‌ర్కార్(Manik Sarkar) విద్యార్థి రాజ‌కీయాల్లో త‌న కెరీర్ ప్రారంభించారు. 20 ఏళ్లుగా త్రిపుర సీఎంగా ప‌ని చేశారు. ఆయ‌న 1980లో త‌న మొద‌టి అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందారు. 2018లో బీజేపీ తొలిసారి రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మారారు. ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క పోవ‌డానికి గ‌ల కార‌ణాన్ని పంచుకున్నారు. కోల్పోయిన కోట‌ను తిరిగి పొందేందుకు లెఫ్ట్ ఫ్రంట్ చేస్తున్న ప్ర‌య‌త్నం మొద‌లైన వాటి గురించి ఆరా తీశారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌మ పార్టీ అనుమ‌తి ఇచ్చిన‌ప్పుడు తాను చిన్న వాడిన‌ని చెప్పారు. ఇప్పుడు చాలా మంది రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇంకా వ‌స్తూనే ఉన్నార‌ని అన్నారు మాణిక్ స‌ర్కార్. భ‌విష్య‌త్తులో వారు బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు వీలుగా వారికి అవ‌కాశం ఇవ్వాలి. న‌న్ను నేను ఒక్క చోటుకే ప‌రిమితం చేసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు మాజీ సీఎం. ఈసారి 50 శాతం మందిని కొత్త వారిని ప‌రిచయం చేస్తున్నామ‌ని తెలిపారు.

సానుకూల‌మైనా లేదా ప్ర‌తికూల మైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు మాణిక్ స‌ర్కార్. బీజేపీ వ‌ల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్ర‌జాస్వామ్యాన్ని నాశ‌నం చేశారు. ప్ర‌జ‌లు ఓటు వేయ‌కుండా అడ్డుకున్నారు. గ‌త ఐదేళ్ల‌లో మీడియా పై కూడా దాడి జ‌రిగింద‌న్నారు. ప‌ని లేదు..తిండి లేదు..కేవ‌లం ఆక‌లి మాత్ర‌మే ఉంద‌న్నారు మాణిక్ స‌ర్కార్(Manik Sarkar).

Also Read : మేయ‌ర్ ఎన్నికపై సుప్రీంకు ఆప్

Leave A Reply

Your Email Id will not be published!