Samatha Kumbh 2023 : దివ్య సాకేతం వ‌సంతోత్స‌వం

స‌మతా కుంభ్ కు భ‌క్త‌జ‌నం

Samatha Kumbh 2023 :  శంషాబాద్ లోని ముచ్చింత‌ల్ లో కొలువు తీరిన దివ్య సాకేతం క్షేత్రం భ‌క్త జ‌న‌సందోహంతో అల‌రారుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌, విదేశాల‌కు చెందిన భ‌క్త బాంధ‌వులు పోటెత్తారు. జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు(Samatha Kumbh 2023)  అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. స‌మ‌స్త లోక క‌ళ్యాణం బాగు కోసం వీటిని నిర్వ‌హిస్తున్నారు జ‌గత్ గురు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 2న ప్రారంభ‌మైన ఈ స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు 14 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. దివ్య సాకేతంలో 108 రూపాల‌లో శాంతి క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని ప్ర‌ధాన వేదిక‌పై నిర్వ‌హించారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు అత్యంత వైభవంగా వసంతోత్స‌వం జ‌రిగింది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌రుడ సేవ‌ను నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తీర్థ గోష్టి, ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రిగింది.

ఫిబ్ర‌వ‌రి 7న మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా జ‌గ‌త్ గురు ఆధ్వ‌ర్యంలో డోలోత్స‌వం జ‌ర‌గ‌నుంది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల దాకా సాకేత రామ‌చంద్ర ప్ర‌భువుకు హ‌నుమ‌ద్వాహ‌న సేవ‌తో పాటు 18 గ‌రుడ సేవ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

8న‌ బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు క‌ళ్యాణోత్స‌వంతో పాటు సామూహిక పుష్పార్చ‌న. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు భ‌గ‌వ‌ద్గీత‌లో సూప‌ర్ మెమోరీ టెస్టు నిర్వ‌హిస్తారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు తెప్పోత్స‌వం నిర్వ‌హిస్తారు.

భ‌క్త బాంధ‌వులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు నిర్వాహ‌కులు.

Also Read : భార‌తీయ సంస్కృతి మాయా ప్ర‌పంచం

Leave A Reply

Your Email Id will not be published!