R Ashwin : భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్ లో తన కెరీర్ లోనే అద్భుతమైన రికార్డ్ ను నమోదు చేశాడు. నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మొదటి రోజు 3 వికెట్లు తీశాడు.
దీంతో రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) తీసిన వికెట్లు 450కి చేరుకున్నాయి. ఆసిస్ ప్లేయర్ అలెక్స్ ను ఔట్ చేశాడు. టెస్టు ఫార్మాట్ లో అత్యంత వేగంగా వికెట్లు తీసిన బౌలర్ గా నిలవడం విశేషం. ఇదిలా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ కేవలం 88 టెస్టుల్లో ఈ ఘనత వహించాడు.
అంతకు ముందు భారత మాజీ క్రికెటర్ కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే పేరు మీద ఉండేది. కుంబ్లే మొత్తం 93 టెస్టులు ఆడాడు 450 వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్ లో ఇప్పటి వరకు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో శ్రీలంకకు చెందిన స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ పేరు మీద ఉంది. లెగ్ స్పిన్నర్ మురళీధరన్ 80 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించాడు.
అశ్విన్ గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లలో సైతం సత్తా చాటాడు. అటు బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా రాణించాడు. బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సైతం భారీ డిమాండ్ ఉంది. కళ్లు చెదిరే లోపు బంతుల్ని తిప్పడం, బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడం రవిచంద్రన్ అశ్విన్ కు(R Ashwin) వెన్నతో పెట్టిన విద్య. ఇదిలా ఉండగా ఇంకా మూడు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది భారత్. అంత లోపు మరిన్ని వికెట్లు పడగొట్టే అవకాశం అశ్విన్ కు ఉంది.
Also Read : పట్టు బిగుస్తున్న భారత్