Mithali Raj : ఐపీఎల్ తో మహిళా క్రికెట్ కు మహర్దశ
మాజీ కెప్టెన్ ..గుజరాత్ మెంటార్ మిథాలీ రాజ్
Mithali Raj : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ఉమెన్ ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా క్రికెట్ కు రాబోయే రోజుల్లో మరింత ఆదరణ లభించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆమె ఓ జాతీయ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో మహిళా క్రికెట్ కు అపూర్వమైన సపోర్ట్ దొరుకుతోందన్నారు మిథాలీ రాజ్(Mithali Raj) .
బీసీసీఐ తీసుకున్న అద్భుత నిర్ణయం దేశంలో క్రికెట్ పట్ల మక్కువ కలిగిన వేలాది మంది మహిళలకు ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. మార్చి నెలలో ప్రపంచంలోనే తొలిసారిగా ఉమెన్ ఐపీఎల్ ను నిర్వహించనుంది బీసీసీఐ. ఇప్పటి వరకు ఏ దేశం దీనిని నిర్వహించడం లేదు.
విచిత్రం ఏమిటంటే ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా లేని రీతిలో ఉమెన్ లీగ్ కు సంబంధించి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు. ఇక ఈనెల 13 నుండి మహిళా క్రికెటర్లకు సంబంధించి వేలం పాట జరగనుంది. ఇప్పటికే 5 జట్లకు సంబంధించి ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాయి. మెంటార్ లు, కోచ్ లను నియమించుకున్నాయి.
స్పాన్సర్ షిప్ కూడా పొందేందుకు వీలు కలుగుతుందని ఈ సందర్భంగా మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె గుజరాత్ ఉమెన్స్ క్రికెట్ ఫ్రాంచైజీకి మెంటార్ గా ఇటీవలే నియమితులయ్యారు. మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ కారణంగా మహిళా క్రికెటర్లకు అపారమైన అవకాశాలు రానున్నాయని కుండ బద్దలు కొట్టారు మిథాలీ రాజ్(Mithali Raj) .
Also Read : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షురూ