PM Narendra Modi Wishes : అరుణాచ‌ల్..మిజోరాం ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్

అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

PM Narendra Modi Wishes : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ,మిజోరాం రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 20న ఈ రెండు రాష్ట్రాలు కొత్త‌గా ఏర్పాటు అయ్యాయి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని అభినంద‌న‌లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ , మిజోరాం దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కొనియాడారు. రాష్ట్రాలు ఏర్ప‌డిన వార్షికోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని కోరారు ప్ర‌ధాన‌మంత్రి.

చైత‌న్యానికి, దేశ భ‌క్తికి ప‌ర్యాయ ప‌దంగా నిలిచిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ , మిజోరాం ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు. ఆ రాష్ట్రాల ప్ర‌జ‌లు అనేక రంగాల‌లో భార‌త‌దేశ ప్ర‌గ‌తికి దోహ‌ద ప‌డ్డార‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే కాలంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌గ‌తి ప‌థంలో కొత్త శిఖ‌రాల‌ను అందుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

ఈ సంద‌ర్భంగా మిజోరాం ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు(PM Narendra Modi Wishes) తెలిపారు. మిజోరాం ప్ర‌కృతి సౌంద‌ర్యానికి , క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే ప్ర‌జ‌ల‌కు శుభాభినంద‌న‌లు. అంతే కాదు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే మీకు ప్ర‌త్యేక గ్రీటింగ్స్ . మిజోరాం ప్ర‌త్యేక‌మైన సంస్కృతికి పేరు పొందింది. మిజోరాం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ఇలాగే కొన‌సాగాలి.

వారి క‌ల‌లు పండాలి. రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల‌తో ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, మిజోరాం రాష్ట్రాల పురోభివృద్దికి కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అన్ని స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

Also Read : ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

Leave A Reply

Your Email Id will not be published!