YS Sharmila Demands : తెలంగాణ‌లో రాష్ట్రప‌తి పాల‌న విధించాలి

వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల డిమాండ్

YS Sharmila Demands : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. పూర్తిగా పాల‌న గాడి త‌ప్పింది. కేవలం సీఎం ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యారు. ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తిపక్షాలు ప్ర‌శ్నిస్తే ర‌క్తం వ‌చ్చేలా కొడతారా అంటూ ప్ర‌శ్నించారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. ప్ర‌జ‌ల త‌ర‌పున నిల‌దీస్తే దానిని ప్ర‌భుత్వం నేరంగా భావిస్తోందంటూ మండిప‌డ్డారు.

పాల‌క‌ప‌క్షం ఇచ్చే బ‌హుమ‌తి ఇదేనా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారో చెప్పాలంటూ సీఎం కేసీఆర్ ను డిమాండ్(YS Sharmila Demands) చేశారు. రౌడీలు, గూండాల‌తో ఇలా ఎంత కాలం పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు.

అధికార‌ప‌క్షం ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయాలని అనుకుంటోంది. ఇది ప్ర‌జాస్వామ్యం అనిపించు కోద‌న్నారు. అలాగైతే రాచ‌రిక‌మే త‌ప్ప డెమోక్ర‌సీ ఉండ‌ద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. పోలీసులు అనుస‌రిస్తున్న తీరు దారుణంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఒక ర‌కంగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం లేద‌ని కేవ‌లం పోలీసు రాజ్యం న‌డుస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తెలంగాణ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ ప్ర‌జ‌ల బాగోగుల గురించి ఏనాడో మ‌రిచి పోయాడంటూ ఫైర్ అయ్యారు వైఎస్ ష‌ర్మిల‌. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు తగిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ లేద‌ని వెంటనే రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇప్ప‌టికైనా పోలీసులు త‌మ విద్యుక్త ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించాల‌ని , లేక పోతే ప్ర‌జ‌లు క్షమించ‌ర‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. యూత్ లీడ‌ర్ పై దాడికి పాల్ప‌డిన బీఆర్ఎస్ శ్రేణుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Also Read : టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న క‌న్నా

Leave A Reply

Your Email Id will not be published!