Manish Sisodia Arrested : సుదీర్ఘ విచార‌ణ..సిసోడియా అరెస్ట్

నిప్పులు చెరిగిన కేజ్రీవాల్..మాన్

Manish Sisodia Arrested : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అంతా ఊహించిన‌ట్లుగానే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ 10 గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించింది. అర్ధ‌రాత్రి హై డ్రామా తర్వాత సిసోడియాను అరెస్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీంతో ఆప్ ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున సీబీఐ కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు ప‌డ్డారు. విచార‌ణ సంద‌ర్భంగా సీబీఐ వేసిన ప్ర‌శ్న‌ల‌కు మ‌నీష్ సిసోడియా(Manish Sisodia Arrested) స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది. దీంతో అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది సీబీఐ.

2021-22కి సంబంధించి ఇప్పుడు ర‌ద్దు చేసిన మ‌ద్యం పాల‌సీని రూపొందించ‌డంలో , అమ‌లు చేయ‌డంలో అవినీతి చోటు చేసుకుంద‌ని ఇందుకు సంబంధించి మ‌నీష్ సిసోడియాకు (Manish Sisodia) కీల‌క‌మైన పాత్ర ఉంద‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 34 మందిపై అభియోగాలు మోపింది. 9 మందిని అరెస్ట్ చేసింది. ప్ర‌స్తుతం సిసోడియో అరెస్ట్ తో మొత్తం ఢిల్లీ లిక్క‌ర్ కుంబభ‌కోణం కు సంబంధించి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుంది సీబీఐ.

ఎక్సైజ్ పాల‌సీలోని వివిధ అంశాలు,ఎఫ్ఐఆర్ లోని దినేష్ అరోరాతో , ఇత‌ర నిందితుల‌తో సిసోడియాకు ఉన్న సంబంధంతో పాటు అనేక ఫోన్ల నుంచి వ‌చ్చిన మెస్సేజ్ ల‌కు సంబంధించిన వివ‌రాల‌పై ఆరా తీసింది సీబీఐ. కానీ వీటికి సంబంధించిన ఏ ఒక్క దానికి సంతృప్తిక‌ర‌మైన జ‌వాబు ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. ఈ సంద‌ర్భంగా ఆప్ ఎంపీ , అధికార ప్ర‌తినిధి సంజ‌య్ సింగ్ నిప్పులు చెరిగారు. ఇది బీజేపీ నియంతృత్వ రాజ‌కీయానికి , వేధింపుల‌కు ప‌రాకాష్ట అని ఆరోపించారు.

Also Read : ఆశ‌ల ప‌ల్ల‌కీ స‌రే ఆచ‌ర‌ణ ఏది

Leave A Reply

Your Email Id will not be published!