Manish Sisodia Appeal : అరెస్ట్ పై సుప్రీంకు సిసోడియా
విడుదల చేయాలని కోరుతూ పిటిషన్
Manish Sisodia Appeal : తనను కావాలని కక్ష సాధింపు ధోరణితో అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా అక్రమమని ఆరోపించారు ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia). ఈ మేరకు ఆయనను ఆదివారం ఎనిమిది గంటల పాటు విచారించింది ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి. అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం ఢిల్లీ కోర్టులో హాజరు పర్చింది సీబీఐ. సుదీర్ఘ విచారణలో ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపించింది.
ఇబ్బందికి గురి చేస్తున్నారని అందుకే ఆయన నుంచి అసలు వాస్తవాలను రాబట్టేందుకు తమకు సమయం కావాలని సీబీఐ కోర్టుకు విన్నవించింది. ఇందుకు సంబంధించి మనీష్ సిసోడియాను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారించిన కోర్టు కేవలం 5 రోజుల పాటు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ చేయడాన్ని ప్రతిపక్షాలతో పాటు ఆప్ ఖండించింది. ఇది పూర్తిగా కావాలని టార్గెట్ చేశారంటూ మండిపడింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటి వరకు 34 మందిపై కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు మనీష్ సిసోడియాతో కలుపుకుని మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుంది. ఇక తదుపరి ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చేర్చింది.
వీరు సౌత్ గ్రూప్ గా ఏర్పడి రూ. 100 కోట్లు కొల్లగొట్టారంటూ ఆరోపించింది. ఇదిలా ఉండగా తన అరెస్ట్ అక్రమమని వెంటనే తనను విడుదల చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia Appeal) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : అస్త్రాలుగా మారిన దర్యాప్తు సంస్థలు