LPG Cylinder Prices : సామాన్యుల‌కు షాక్ గ్యాస్ ధ‌ర‌లు ఝ‌ల‌క్

భారీగా పెంచేసిన గ్యాస్ కంపెనీలు

LPG Cylinder Prices : గ్యాస్ కంపెనీలు ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ ఇచ్చాయి. అటు క‌మ‌ర్షియ‌ల్ ఇటు డొమెస్టిక్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించాయి. భారీగా పెంచ‌డంపై భ‌గ్గుమంటున్నారు వినియోగ‌దారులు. వామ్మో మార్చి నెల అంటేనే జ‌డుసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త‌మ ఇష్టానుసారం పెంచుకుంటూ పోతున్నాయి. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం వాటిపై నియంత్ర‌ణ కోల్పోయింది. ప‌దే ప‌దే పెంచుకుంటూ పోతున్నా అడిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఒక ర‌కంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయింది ప్ర‌స్తుత ప్ర‌భుత్వం.

దేశ వ్యాప్తంగా ఈ అర్థ‌రాత్రి నుంచే పెంచిన ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని గ్యాస్(LPG Cylinder Prices) కంపెనీలు ప్ర‌క‌టించాయి. ఎనిమిది నెల‌ల గ్యాప్ త‌ర్వాత దెబ్బ కొట్టాయి. కోలుకోలేని రీతిలో షాక్ కు గురి చేశాయి. ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు జ‌నం అల్లాడి పోతున్నారు.

అయినా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌నిక‌రం చూప‌డం లేదు. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ. 1053 ఉండ‌గా మార్చి 1 నుంచి 1103 రూపాయ‌ల‌కు చేరింది. క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర(LPG Cylinder Prices) నిన్న రూ. 1769 ఉంటే ఇవాళ రూ. 2,119 రూపాయ‌ల‌కు చేరింది

ఒక్క క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర‌ను ఏకంగా రూ. 350 పెంచ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోల్ క‌తా లో రూ. 2,221 కాగా ముంబైలో రూ. 2,071 గా మారింది. చెన్నైలో వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ. 2,268కి పెరిగింది.

ఇక తెలుగు రాష్ట్రాల‌లో కూడా దీని ప్ర‌భావం ప‌డింది. హైద‌రాబాద్ లో రూ. 50 పెరిగింది. దీని రేటు ఇప్పుడు రూ. 1,155కి చేరింది. ఏపీలో రూ. 50 పెరిగింది. దీని ధ‌ర రూ. 1161 పెరిగింది.

Also Read : సాంకేతిక సాయం దేశం పురోగ‌మ‌నం

Leave A Reply

Your Email Id will not be published!