Terror Attacks In India : భారీగా తగ్గిన ఉగ్రవాద దాడులు
ప్రకటించిన కేంద్ర హోం శాఖ
Terror Attacks In India : భారత దేశంలో గత కొంత కాలం నుంచి ఉగ్రవాదుల దాడులు తగ్గాయి. ఇదే విషయాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. 2021లో 16 శాతం తగ్గడం విశేషం. 2018 సంవత్సరానికి కంటే మరీ తక్కువ(Terror Attacks In India). ఇక మావోయిస్టులు 2021లో గరిష్టంగా 39 శాతం దాడుల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ మద్దతు కలిగిన లష్కర్ ఇ తోయిబా 9 శాతానికి పాల్పడింది. ఇక రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) 3 శాతం దాడుల్లో పాల్గొంది. హిజుబుల్ ముజాహిదిన్ 12 శాతానికి పాల్పడింది.
భారత దేశం అంతటా 33 శాతం దాడులు జరిగాయి. ఈ విశ్లేషణ కంట్రీ రిపోర్ట్ ఆన్ టెర్రరిజం 2021లో సమర్పించిన నివేదిక వెల్లడించింది ఈ వివరాలను. దీనిని విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఉగ్రవాద దాడుల ఘటనల్లో భారత దేశం మొదటి 10 దేశాలలో ఉంది. కానీ 2021లో మరణాలలో మొదటి పది స్థానాలలో లేక పోవడం గమనార్హం. 2020 నుండి ఉగ్రవాద సంబంధిత సంఘటనలు 16 శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో కేవలం 5 శాతం మరణాలు మాత్రమే సంభవించాయి. ఇక సంవత్సరాల వారీగా చూస్తే 2018లో 673 ఉగ్ర దాడులు జరిగాయి.
2019లో 655, 2020లో 679 ఉగ్ర దాడులు చోటు చేసుకున్నాయి. 2021లో జమ్మూ కాశ్మీర్ నుండి గరిష్టంగా 252 దాడులు లేదా 44 శాతం జరిగాయి. మావోయిస్టు తిరుగుబాటు సంస్థ ఛత్తీస్ గఢ్ లో 119 , జార్ఖండ్ లో 59 ఘటనలకు పాల్పడింది. ఏప్రిల్ 2021లో బీజాపూర్ మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో జనాన్ని టార్గెట్ చేశాయని సీఆర్టీ పేర్కొంది.
Also Read : అమృతపాల్ సింగ్ భారతీయుడు కాదు