Delhi New Ministers : కేజ్రీవాల్ కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్
సౌరభ్ భరద్వాజ్..అతిషికి ప్రయారిటీ
Delhi New Ministers : ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆప్ లో నెంబర్ 2 గా ఉంటూ వచ్చిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అడ్డంగా ఇరుక్కున్నారు. ఇప్పుడు సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక మరో మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఎంజాయ్ చేస్తున్నారు. అటు సిసోడియా ఇటు సత్యేంద్ర జైన్ లు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వారు చేసిన రాజీనామాలను వెంటనే ఓకే చెప్పేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ఆ ఇద్దరి స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్ , అతిషలను మంత్రి పదవులకు సంబంధించి ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ఏకంగా 18 శాఖలను నిర్వహించారు. విద్య, వైద్యం, మద్యం శాఖలను నిర్వహించారు. తాజాగా ఆ ఇద్దరూ గుడ్ బై చెప్పడంతో వారి స్థానంలో ఖాళీ అయిన మంత్రి పదవుల్లో(Delhi New Ministers) సౌరభ్ , అతిషిలను ఎంపిక చేశారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఆ ఇద్దరి రాజీనామాలను ఆమోదించి 24 గంటలు గడవక ముందే కేజ్రీవాల్ ఇద్దరు కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇవ్వడం విశేషం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. 10 మందిని అరెస్ట్ చేసింది. అందులో మనీష్ సిసోడియా ఉన్నారు. ఇక 9 నెలల కిందట సత్యేంద్ర జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో సేద దీరుతున్నారు.
Also Read : ఆప్ కు షాక్ బీజేపీ లోకి జంప్