Sambit Patra Rahul : రాహుల్ కామెంట్స్ బీజేపీ సీరియస్
నిరాధార ఆరోపణలు తగదన్న పాత్రా
Sambit Patra Slams Rahul : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగింది భారతీయ జనతా పార్టీ. బ్రిటన్ లోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి యూనివర్శిటీ లో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా స్పైవేర్ పెగాసెస్ ను ప్రయోగించారని, తన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
దేశంలో కులం, మతం ప్రాతిపదికగా రాజకీయాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంది బీజేపీ . ఆయన కేవలం తనకు పవర్ రాలేదన్న అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించింది.
ఓ వైపు యావత్ ప్రపంచం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని కానీ దానిని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా(Sambit Patra Slams Rahul).
దేశంలో ఇన్వెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ కూడా ప్రస్తుతం భారత్ పై ఆరోపణలు చేయాలంటే జడుసు కుంటోందని కానీ రాహుల్ వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు పాత్రా. ఒక దేశం గురించి ఇలాగేనా బాధ్యత కలిగిన నాయకుడు మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు.
Also Read : లైసెన్స్ రద్దయినా అక్రమ మైనింగ్