Assam CM Modi : మోదీ నాయకత్వం ఈశాన్య విజయం
అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ
Assam CM Modi : ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ , దాని మిత్రపక్షాలు అద్భుత విజయాలు నమోదు చేసింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో మరోసారి పవర్ లోకి వచ్చేలా చేసింది. ఈ సందర్భంగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు.
ఈశాన్య విజయం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నాయకత్వానికి దక్కిన ప్రతిఫలంగా అభివర్ణించారు. ఇవాళ దేశం యావత్తు మోదీ సమర్థతను గుర్తించారని, అందుకే అంతులేని విజయాలను కట్టబెడుతున్నారంటూ కితాబు ఇచ్చారు సీఎం(Assam CM Modi).
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున మోదీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారని అందుకే ఈ గెలుపు తమకు దక్కిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా జనం నమ్మ లేదన్నారు హిమంత బిస్వా శర్మ. ప్రజలు ప్రధానిపై తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి కూడా ఈ సందర్భంగా తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. మేఘాలయ మినహా రెండు రాష్ట్రాలలో ఎన్డీఏ, బీజేపీ గెలవడం ఇది రెండోసారి అని చెప్పారు సీఎం. లోక్ సభలో కూడా 25 నుంచి 26 సీట్లు ఉన్నాయన్నారు.
ఈశాన్య ప్రాంతంలో ప్రధానమంత్రి మోదీ చేసిన కృషి వల్లనే ఈ విజయం దక్కిందని కితాబు ఇచ్చారు. తామంతా ఆయన నాయకత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. త్రిపురలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కలిసినా తమ విజయాన్ని అడ్డు కోలేక పోయాయని ఎద్దేవా చేశారు హిమంత బిస్వా శర్మ(Assam CM).
Also Read : ‘ఈశాన్యం’ నేర్పిన పాఠం