Kiren Rijiju : న్యాయ వ్యవస్థను ప్రశ్నించలేం – రిజిజు
సంక్షోభంలో ఉన్నాయని చెప్పే కుట్ర
Kiren Rijiju Judiciary System : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఈసారి న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, డెమోక్రసీ రెండూ సంక్షోభంలో ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు కిరెన్ రిజిజు(Kiren Rijiju Judiciary System). భారత్ ను అప్రతిష్టపాలు చేసేందుకు దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి.
వారు చేసే ఏ ప్రయత్నం విజయవంతం కాదని స్పష్టం చేశారు. తూర్పు రాష్ట్రాల్లోని కేంద్ర న్యాయవాదుల సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని పేర్కొన్నారు కిరెన్ రిజిజు. భారత న్యాయ వ్యవస్థను ప్రశ్నించలేం. ముఖ్యంగా న్యాయమూర్తుల విజ్ఞతను ప్రజల పరిశీలనలో ఉంచ లేమన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ భారత న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉందని ప్రపంచానికి చెప్పేందుకు కొన్నిసార్లు దేశం లోపల, వెలుపుల పనిగట్టుకుని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇది కొంత మంది ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కానీ వారి ఆటలు సాగవన్నారు కిరెన్ రిజిజు. భారత దేశాన్ని , దాని ప్రజాస్వామ్య వ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడంలో నిగూఢమైన ఉద్దేశాలతో ఏ ప్రచారమూ విజయవంతం కాదన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి.
అమెరికా అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే భారత దేశం నిజంగా డెమోక్రసీకి తల్లి లాంటిదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రజల విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు కేంద్ర మంత్రి(Kiren Rijiju).
Also Read : మోదీ నాయకత్వం ఈశాన్య విజయం