Manik Sarkar : ప్రహసనంగా మారిన ఎన్నికలు – సర్కార్
మాజీ సీఎం సంచలన కామెంట్స్
Manik Sarkar Tripura Results : త్రిపురలో జరిగిన ఎన్నికలపై సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం మాణిక్ సర్కార్(Manik Sarkar). ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబింప చేయలేదన్నారు. సుదీర్ఘ కాలం పాటు త్రిపుర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఈసారి శాసనసభ ఎన్నికల ఫలితాలు ఊహించనిరీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి తీర్పు ఇవ్వలేక పోయారని ఆవేదన చెందారు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, తన మిత్రపక్షంతో కలిసి చేసిన పన్నాగం, కుట్రకు పరాకాష్ట ఈ ఎన్నికలని పేర్కొన్నారు మాణిక్ సర్కార్.
ఎన్నికలను ప్రహసనంగా మార్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని మండిపడ్డారు మాజీ సీఎం. బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించడంలో ఆ పార్టీకి అనేక అంశాలు సహకరించాయని ఆరోపించారు మాణిక్ సర్కార్(Manik Sarkar Tripura Results). ప్రభుత్వ పనితీరు శూన్యం తప్ప ఏమీ లేదు. ప్రజాస్వామ్యంపై దాడి చేయడం, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల హక్కుల్ని హరించారు. ఇది ఊహించలేనిది. ఇలాంటి ప్రక్రియ ఇంతకు ముందు ఎన్నడూ లేదన్నారు మాజీ సీఎం. ఎన్నికలను కేవలం తమకు అనుకూలంగా మల్చుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించు కోదన్నారు .
ఫలితం వేరేలా ఉంది. 60 శాతం మంది ఓటర్లు బీజేపీకి ఓట్లు వేయలేదని ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎవరు సహకరించారని ప్రజలు చెప్పుకోవడం విడ్డూరంగా మారిందన్నారు మాణిక్ సర్కార్. తాను ఏ పార్టీ గురించి ప్రస్తుతం ప్రస్తావించ దల్చుకోలేదన్నారు మాజీ సీఎం.
Also Read : దర్యాప్తు సంస్థలపై పీఎంకు లేఖ