Anurag Thakur Rahul : ప్రచారం కోసం రాహుల్ దుష్ప్రచారం
అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్
Anurag Thakur Rahul : కేంద్ర క్రీడా, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. లండన్ వేదికగా ఇండియన్ జర్నలిస్టులతో జరిగిన సంభాషణలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా మోదీ సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. దీనిపై సోమవారం సీరియస్ గా స్పందించారు అనురాగ్ ఠాకూర్.
రాహుల్ గాంధీకి ఈ దేశం పట్ల గౌరవం లేదన్నారు. ఆయనకు ఇతర దేశాల మీద మోజు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయన భాష, ఆలోచనలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur Rahul) . కేవలం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే మోదీ ప్రభుత్వంపై దుష్పచారానికి తెర లేపారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
దయచేసి దేశానికి ద్రోహం చేయవద్దని సూచించారు. భారత దేశ విదేశాంగ విధానంపై ఉన్న అభ్యంతరాలు ఈ సమస్యపై మీకున్న అవగాహన ఏపాటిదో తెలుస్తుందన్నారు. విదేశాల నుంచి భారత దేశంపై పనిగట్టుకుని మీరు చేస్తున్న ప్రచారం , మాట్లాడుతున్న అబద్దాలను ఈ దేశ ప్రజలు ఎన్నడూ నమ్మరని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) వివాదాల తుఫానుగా మారారని మండిపడ్డారు. అది విదేశీ ఏజెన్సీలు కావచ్చు. విదేశీ ఛానళ్లు కావచ్చు. లేదా విదేశీ నేల కావచ్చు. భారత దేశాన్ని కించ పరిచేందుకు ఏ ఒక్క ఛాన్స్ ను మిస్ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు.
Also Read : సీబీఐ తన పని తాను చేస్తోంది