Meta Layoffs : వేలాది మందిపై వేటుకు ‘మెటా’ సిద్దం
ఆర్థిక సంవత్సరంలో కోతకు ప్లాన్
Meta Facebook Layoffs : ప్రముఖ సామాజిక దిగ్గజం మెటా ఫేస్ బుక్ వేలాది మందిపై వేటు వేయాలని చూస్తోంది. ఇప్పటికే పలువురిని తొలగించింది. ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం పేరుతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే మెటా కాస్ట్ కటింగ్ లో భాగంగా 10 వేల మందిని సాగనంపింది. తాజాగా వేలాది మందికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ యజమాని అయిన మెటా ప్లాట్ ఫారమ్ లలో తొలగించేందుకు(Meta Facebook Layoffs) ప్లాన్ చేస్తోంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు మెటా వేలాది ఉద్యోగాలను తగ్గించేందుకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసింది.
ప్రపంచం లోని అతి పెద్ద సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీగా పేరొందింది మెటా ఫేస్ బుక్. చైర్మన్ , సిఇఓ అయిన మార్క్ జుకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశారు. ఆర్థిక మాంద్యం కారణంగా తొలగించక తప్పడం లేదని స్పష్టం చేశాడు.
పనితీరు మార్చుకోవాలని లేక పోతే వేటుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. వరల్డ్ లో టాప్ లో ఉన్న మెటా ఇప్పుడు తగ్గించడమే పనిగా పెట్టుకుంది. మొత్తం ఉద్యోగులలో 13 శాతం తగ్గించేందుకు డిసైడ్ అయ్యింది . ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు మార్క్ జుకర్ బర్గ్.
జాబర్స్ తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతానికి 11,000 మందిని ఇంటికి సాగనంపింది మెటా ఫేస్ బుక్. తాజాగా వేలాది మందిని పంపిస్తే ఇక తమ పరిస్థితి ఏమిటనే దానిపై మిగతా పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తుమ్మితే ఊడిపోయే స్థితికి చేరుకున్నాయని వాపోతున్నారు. మొత్తంగా మెటా ఫేస్ బుక్(Meta Facebook Layoffs) కొట్టిన దెబ్బకు అంతా లబోదిబోమనే స్థితికి చేరుకుంది.
Also Read : నిరుద్యోగులకు రూ. 2,500 పెన్షన్