Nalin Kumar Kateel Rahul : రాహుల్ కు పిల్ల‌లు పుట్టే ఛాన్స్ లేదు

బీజేపీ నేత న‌ళిని కుమార్ క‌టిల్ కామెంట్స్

Nalin Kumar Kateel Rahul : క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం జోరందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ – మే నెల‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ న‌ళిని కుమార్ క‌ట్టిల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి పిల్ల‌లు పుట్టే ఛాన్స్(Nalin Kumar Kateel Rahul) లేద‌న్నారు. అందుకే ఆయ‌న పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ నోరు పారేసుకున్నారు. స్థాయికి మించి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది.

బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు పూర్తిగా ప్ర‌జాస్వామ్య విరుద్ద‌మ‌ని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ప్రియాంక్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు. మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న ఎంపీకి త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. అధికారం ఉంద‌నే అహంకారంతో లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. సంస్కారాన్ని మ‌రిచి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని తెలియ చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు ఖ‌ర్గే.

దేశం కోసం త‌న ఫ్యామిలీ త్యాగం చేసింద‌ని మ‌రి భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లు ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి చ‌వ‌క‌బారు కామెంట్స్ చేయ‌డం వ‌ల్ల ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని ఎద్దేవా చేశారు ప్రియాంక్ ఖ‌ర్గే. ఒక ర‌కంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి విష‌యం అనేది ఆయ‌న వ్య‌క్తిగ‌తం అని అది క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు.

Also Read : మార్చి 10న రాహుల్ పై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!