MLC Kavitha : ధ‌ర్నా సాగేనా అరెస్ట్ జ‌రిగేనా

ఢిల్లీలో క‌ల్వ‌కుంట్ల క‌విత

MLC Kavitha Protest : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపుతోంది. తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించేలా చేస్తోంది. ఈ కేసులో కీల‌క పాత్ర పోషించారంటూ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై (MLC Kavitha) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ. 

ఇదే స‌మ‌యంలో తాజాగా మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించి తాజాగా క‌విత‌కు నోటీసులు జారీ చేసింది. ఈ త‌రుణంలో క‌విత అరెస్ట్ త‌ప్ప‌ద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయ‌ని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కీల‌క పాత్ర పోషించింద‌టూ కోర్టుకు స‌మ‌ర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది సీబీఐ.

ఇద కేసులో 34 మందిపై అభియోగాలు మోపింది సీబీఐ. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మందిని అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను తీహార్ జైలుకు పంపింది. ఇదే క్ర‌మంలో త‌ర్వాత ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు తెర దించింది ఈడీ. ఢిల్లీలోని ఆఫీసుకు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది నోటీసులో. మ‌రో వైపు మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని కోరుతూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టేందుకు ప్లాన్ చేసింది ఎమ్మెల్సీ క‌విత‌(MLC Kavitha Protest).

గ‌తంలో మ‌హిళ‌ల హ‌క్కుల గురించి, బాధితుల గురించి మాట్లాడ‌ని క‌విత‌కు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వ‌చ్చిందంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఇదంతా క‌విత ఆడుతున్న డ్రామా అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు బ‌క్క జ‌డ్స‌న్. ఇక ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు బీజేపీ సీనియ‌ర్ నేత , మాజీ ఎంపీ వివేక్ వెంక‌టస్వామి.

Also Read : ఈడీ నోటీస్ క‌విత సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!