MLC Kavitha ED : 11న ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీలో ధర్నా చేపట్టనున్న బతుకమ్మ
Kavitha ED : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత మార్చి 11న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కానున్నారు. సోమవారం ఈడీ అరెస్ట్ చేసింది ప్రముఖ వ్యాపారవేత్త అరుణ రామచంద్రన్ పిళ్లైని. ఆయన అప్రూవర్ గా మారినట్లు సమాచారం. పిళ్లై ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్సీ కవితకు(Kavitha ED) ఈడీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
ఇందుకు సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు కవిత. తనకు ఈడీ నోటీసు జారీ చేసిందని, తాను ఈడీ ముందు హాజరవుతానని తెలిపారు. అయితే తాను మహిళలకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ ధర్నా చేపట్టానని ఇప్పుడు హాజరు కాలేనంటూ పేర్కొన్నారు కవిత. 9న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది ఎమ్మెల్సీ కవిత. ఈడీ సమన్లు అందుకున్న కవిత న్యూఢిల్లీకి చేరుకున్నారు. తాను శనివారం ఈడీ ఆఫీసు ముందుకు వెళతానని చెప్పారు.
ఇక ఈడీ అరెస్ట్ చేసిన సౌత్ గ్రూప్ కి చెందిన ఫ్రంట్ మెన్ హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారినట్లు సమాచారం. ఈడీ విచారణలో తాను ఎమ్మెల్సీ కవిత కు(Kavitha ED) ప్రతినిధిగా వ్యవహరించానని చెప్పాడు.
దీనిపై క్లారిటీ తీసుకునేందుకు ఈడీ తాజాగా కవితకు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవిత స్టేట్ మెంట్ ను ఏజెన్సీ రికార్డు చేయనుంది. సిసోడియా లాగానే కవితను కూడా విచారించి అరెస్ట్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
Also Read : పిళ్లై అంగీకారం కవితకు ప్రమాదం