MLC Kavitha Dharna : 10న ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష
విపక్ష పార్టీల మద్దతు
MLC Kavitha Dharna : మహిళా రిజర్వేషన్ బిల్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దేశ రాజధాని ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టనున్నారు.
ఆమె ఆందోళనకు(MLC Kavitha Dharna) మద్దతుగా దేశంలోని 16 పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ ప్రజా సంఘాలు పాల్గొననున్నాయి.
కవిత దీక్షకు మద్దతు ప్రకటించిన వారిలో బీఆర్ఎస్ , నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీపీ, టీఎంసీ, అకాలీదళ్ , జేడీయూ, ఆర్జేడీ , సమాజ్ వాదీ పార్టీ , సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన , ఆప్ , ఆర్ఎల్డీ , జేఎంఎం సంఘీభావం ఇప్పటికే ప్రకటించాయి.
ఇప్పటికే దీక్షకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేపట్టింది భారత జాగృతి సంస్థ. దీనికి ఆమె వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. మరో వైపు అరెస్ట్ భయం కూడా వెంటాడుతోంది.
ఇప్పటికే కీలక మంత్రివర్గం భేటీ జరుగుతోంది. రేపటి కార్యక్రమం, ఎల్లుండి జరిగే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పాత్ర ఎమ్మెల్సీ కవితదేనని(MLC Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తేల్చింది. ఆమెతో పాటు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఇరికించింది.
ఇప్పటికే 9న హాజరు కావాలంటూ కవితకు ఈడీ నోటీసు జారీ చేసింది. అయితే ముందస్తు ప్రోగ్రామ్ లు ఉన్నాయని అందుకే తాను హాజరు కాలేనంటూ సమాధానం ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాను సహకరిస్తానని, మార్చి 11న శనివారం ఈడీ ఆఫీసుకు వస్తానని తెలిపింది. ఇదే సమయంలో తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించింది.
మరో వైపు సౌత్ గ్రూప్ లో కీలక వ్యాపారవేత్తగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని సోమవారం ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన వెల్లడించిన వివరాల మేరకు కవితక్కకు నోటీసు జారీ చేసింది ఈడీ. అటు పిళ్లై ఇటు కవితతో పాటు బుచ్చిబాబును కూడా హాజరు పరిచి విచారించే ఛాన్స్ ఉంది.
Also Read : ధర్నా సాగేనా అరెస్ట్ జరిగేనా