MK Stalin : గవర్నర్ నిర్వాకం స్టాలిన్ ఆగ్రహం
బిల్లుల పెండింగ్ పై సీరియస్
MK Stalin Governor : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు సీఎం. తాజాగా మరోసారి సీరియస్ అయ్యారు ఎంకే స్టాలిన్(MK Stalin Governor).
ఆర్ ఎన్ రవి కావాలని బిల్లులు నిలిపి ఉంచారంటూ మండిపడ్డారు. ఇలాగైతే భారత దేశాన్ని ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు సీఎం. నీట్ మినహాయింపు బిల్లు రాష్ట్రపతికి పంపించేందుకు చాలా కాలం ముందు తన వద్ద ఉందని అన్నారు ఎంకే స్టాలిన్. విశ్వాసం , భాషతో పాటుగా ఒకే భావనను సమర్థించిన వారు సామాజిక న్యాయానికి పూర్తిగా విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ గవర్నర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు సీఎం. తమిళనాడుకకు నీట్ మినహాయింపు కోరే బిల్లు, ఆన్ లైన్ రమ్మీకి వ్యతిరేకంగా నిషేధాన్ని ప్రతిపాదించే మరో బిల్లుతో సహా కీలక బిల్లులకు పెండింగ్ లో ఉన్న అంగీకారంపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులో జరిగిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) 75వ సంవత్సర వేడుకల్లో డీఎంకే చీఫ్ ప్రసంగించారు. తన దివంగత తండ్రి మాజీ సీఎం కరుణానిధికి ముస్లింలతో ఉన్న సత్ సంబంధాలను , తన జీవితంలో వారి పాత్రను ప్రేమగా గుర్తు చేసుకున్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
Also Read : తమిళనాడుపై జేపీ నడ్డా నజర్