Owaisi KCR Modi : కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష కట్టిన మోదీ
సంచలన ఆరోపణలు చేసిన ఓవైసీ
Owaisi Kavitha Probe : లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై సానుభూతి ప్రకటించారు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi Kavitha Probe). ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు మోదీ కొలువు తీరిన కేంద్ర సర్కార్ ను . కావాలని సీఎం కేసీఆర్ కుటుంబాన్ని మోదీ టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.
ప్రజల కోసం పని చేస్తున్న పార్టీని , ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ. ఏది ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వచ్చంధంగా పని చేయాలని ఇలా ఒత్తిళ్లకు లోబడి పని చేయకూడదని హితవు పలికారు.
రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందిస్తున్న కేసీఆర్ ఇప్పుడు కంట్లో నలుసుగా మారాడని అందుకే కేంద్రం ఆయనను టార్గెట్ చేసిందంటూ ధ్వజమెత్తారు అసదుద్దీన్ ఓవైసీ. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలలోనే ఎందుకు దాడులు జరుగుతున్నాయంటూ ఎంపీ ప్రశ్నించారు.
దేశంలో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని దీనిని తట్టుకోలేకే కేంద్రం కేసీఆర్ పై నజర్ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు ఎంపీ. ఇదే సమయంలో దేశంలో ముస్లింల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బతికే పరిస్థితులు లేవన్నారు. ముస్లింలను ఆర్థికంగా వెలి వేయాలని బీజేపీ ఎంపీలు కొందరు పిలుపునిచ్చారని ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇక నుంచి వేధింపులు ఆపాలని సూచించారు ఎంపీ(Owaisi).
Also Read : కొనసాగుతున్న ఈడీ విచారణ