CJI Chandrachud : న్యాయ వ్య‌వ‌స్థ‌కు టెక్నాల‌జీ అవ‌స‌రం

సీజేఐ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్

CJI Chandrachud Technology : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పౌరులకు మెరుగైన సేవ‌లు అందాలంటే ముందుగా న్యాయ వ్య‌వ‌స్థ‌లో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి వేగ‌వంతంగా ప‌రిష్కారం అయ్యేందుకు టెక్నాల‌జీ(CJI Chandrachud Technology) ఉప‌యోగ ప‌డుతుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు సీజేఐ. పౌరుల‌ను చేరుకునేందుకు న్యాయ వ్య‌వ‌స్థ త‌ప్ప‌నిస‌రిగా సాంకేతిక‌త‌ను ఉప‌యోగించాల‌ని స్ప‌ష్టం చేశారు.

షాంఘై కో ఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్సీఓ) సుప్రీంకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల 18వ స‌మావేశంలో భాగంగా న్యూఢిల్లీలో జ‌రిగిన స్మార్ట్ కోర్టులు – న్యాయ వ్య‌వ‌స్థ భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మంలో సీజేఐ ప్ర‌సంగించారు. పౌరుల‌కు చేరువ కావ‌డానికి , న్యాయాన్ని అవ‌స‌ర‌మైన సేవ‌గా అందించేందుకు న్యాయ వ్య‌వ‌స్థ త‌ప్ప‌నిస‌రిగా సాంకేతిక‌త‌తో అనుసంధానం కావాల‌న్నారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్.

ఇ కోర్టుల మూడో ద‌శ‌కు కేంద్రం నిధులు మంజూరు చేసిందని, ఇ కోర్టులు భ‌విష్య‌త్ న్యాయ వ్య‌వ‌స్థ‌ను రూపొందించేందుకు అంకిత భావంతో ప‌ని చేశాయ‌ని చెప్పారు. మొద‌టి, రెండో ద‌శ‌లు స్థానిక స్థాయిలో అవ‌స‌ర‌మైన డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల‌ను సృష్టించ‌డం వ‌ల్ల మేలు జ‌రిగింద‌న్నారు సీజేఐ.

అన్ని ఇ ఇన్షియేటివ్ లు కూడా డేటా ప్రొటెక్ష‌న్ ఫ్రేమ్ వ‌ర్క్ ద్వారా నిర్వ‌హించ బ‌డ‌తాయ‌న్నారు. గోప్య‌తా స‌మ‌స్య‌ల‌కు సున్నితంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు ధనంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud). న్యాయం అనేది కేవ‌లం సార్య భౌమాధికారం కాదు అత్య‌వ‌స‌ర సేవ అని స్ప‌ష్టం చేశారు. పౌరుల‌కు , న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని త‌గ్గించేందుకు సాంకేతిక అవ‌స‌ర‌మ‌న్నారు.

Also Read : పంజాబ్ లో 813 గ‌న్ లైసెన్సులు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!