RRR At Oscars 2023 : విశ్వ వేదికపై నాటు నాటు అదుర్స్
ఆస్కార్ వేదికపై పర్ ఫార్మెన్స్ సూపర్
RRR At Oscars 2023 : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. ఎక్కడ చూసినా నాటు నాటు పాటనే వినిపిస్తోంది..కనిపిస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. చంద్రబోస్ రాస్తే ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ పాడారు.
ఆస్కార్ అకాడెమీ అవార్డులకు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్(RRR At Oscars 2023) కేటగిరీకి నాటు నాటు సాంగ్ ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇచ్చారు. అంతకు ముందు ఈ పాట గురించి ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణే వివరించారు.
ఈ పాట ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇరుక్కోలేని ఆకట్టుకునే బృంద గానం, ఎలక్ట్రిఫైయింగ్ బీట్ లు, కిల్లర్ డ్యాన్స్ లతో కూడిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఇది నిజ జీవితంలో భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ మధ్య స్నేహం గురించిన చిత్రం.
ఆర్ఆర్ఆర్ లో కీలక సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అంటూ పరిచయం చేశారు దీపికా పదుకొణే. తెలుగులో పాడటం , చలన చిత్రం వలస వాద వ్యతిరేక ఇతివృత్తాలను వివరించడంతో పాటు ఇది పూర్తిగా సంచలనం అని పేర్కొంది. యూబ్యూట్ , టిక్ టాక్ లను విస్మయ పరిచింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ తెలిపారు.
Also Read : ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్