Pawan Kalyan : పార్టీకి అతడే బలం బలగం
జనసేనకు పవన్ సేనాని
Pawan Kalyan Janasenani : పవన్ కళ్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మెరుగైన సమాజం కోసం అంటూ ప్రజల్లోకి వచ్చారు. మార్చి 14, 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ప్రజలందరి సంక్షేమం కోసం తాను పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో దోస్తీ కొనసాగిస్తున్నారు. ఆ మధ్యన కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి ఉన్నారు. ఇది పక్కన పెడితే జనమే జెండా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan Janasenani).
ప్రస్తుతం జనసేన పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బలం అతడే పార్టీకి బలగం కూడా ఆయనే. ఏపీలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీసీలను ఒక్కటి కావాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, ప్రజలు తనను ఎందుకు గెలిపించ లేక పోయారనే దానిపై ఇప్పటికీ మధన పడుతూనే ఉన్నారు.
ఏది ఏమైనా రాష్ట్రంలో గత కొంత కాలం నుంచీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. సీఎంను, వైసీపీ పార్టీని, మంత్రులను , ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తూ..నిలదీస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.
విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షాలు ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టకుండా ఏపీ సర్కార్ చట్టం తీసుకు వచ్చింది. ఇక ఇవాళ మార్చి 14. జనసేన పార్టీ ఆవిర్భావం. అందుకే మచిలీపట్నం వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read : జన పక్షం జెండా జనసేన ఎజెండా