YS Sharmila : దొర పాల‌న‌లో జ‌నం ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల‌

YS Sharmila KCR Ruiling : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల (YS Sharmila KCR Ruiling) షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె స్పందించారు. తెలంగాణ పేరుతో కొలువు తీరిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిట్ట క‌థ‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం అని చెప్పింది సీఎం కేసీఆర్ కాదా అని ప్ర‌శ్నించారు. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పి మోసం చేసింది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అర్థ‌మై పోయింద‌న్నారు. దేశంలోనే అత్యంత అవినీతిక‌ర‌మైన కుటుంబం ఏదైనా ఉందంటే అది క‌ల్వ‌కుంట్ల కుటంబం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. అపార‌మైన వ‌న‌రులు క‌లిగిన తెలంగాణ‌ను నిర్వీర్యం చేస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.

ఆనాడు త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ హ‌యాంలో చేప‌ట్టిన ప్రాజెక్టులే త‌ప్పా ఒక్క‌టైనా కొత్త‌ది నిర్మించారా అని కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. రుణ మాఫీ, ఉచిత క‌రెంట్ , స‌బ్సిడీ ప‌థ‌కాలు రైతుల‌కు చేసిన ఘ‌న‌త వైఎస్ అని మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల‌. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

ఒక్క టీఎస్ పీస్సీలో 35 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకున్నార‌ని , రాష్ట్రంలో నిరుద్యోగం ఏ ర‌కంగా ఉందో అర్థ‌మ‌వుతుంద‌న్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ (YS Sharmila). రాష్ట్రం విడి పోయిన‌ప్పుడు మిగులు బ‌డ్జెట్ తో ఉంద‌ని కానీ ఇప్పుడు అప్పులపాల చేసిన చ‌రిత్ర కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని ఆరోపించారు. పోడు ప‌ట్టాలు ఇస్తాన‌ని చెప్పి గిరిజ‌న బిడ్డ‌ల‌ను కొట్టి చంపుతున్న‌ది మీరు కాదా అంటూ నిల‌దీశారు.

Also Read : సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాలి – ఆర్ఎస్

Leave A Reply

Your Email Id will not be published!