BS Yediyurappa : బీఎస్ యడ్యూరప్ప ఘెరావ్
సిటి రవీ మద్దతుదారుల నిరసన
BS Yediyurappa Gherao : మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు సిటి రవి మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో ప్రచారాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక లోని ముదిగెరె నియోజకవర్గంలో నాటకీయ దృశ్యాలు బయట పడ్డాయి. గందరగోళం తర్వాత బీఎస్ యడ్యూరప్ప కలత చెందారు.
రోడ్ షోను నిర్వహించకుండానే వెళ్లి పోవడం కలకలం రేపింది. మాజీ సీఎం , సిటి రవి మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు ఇవాళ బట్ట బయలు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు బీవై విజయేంద్ర షిమోగా జిల్లా లోని షికారిపుర నుండి పోటీ చేస్తారని బీఎస్ యడ్యూరప్ప ప్రకటన చేశారు. దీనిని సిటి రవి తోసిపుచ్చారు. ఇది ఇవాళ షోడౌన్ కు దారి తీసిన ఘర్షణకు దారి తీసింది.
ముదిగెరె నియోజకవర్గంలో బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రకు నాయకత్వం వహించేందుకు యడ్యూరప్ప వచ్చినప్పుడు నాటకీయ దృశ్యాలు బయట పడ్డాయి. మరో వైపు ముదిగెరె నియోజకవర్గంలో మరో పర్యాయంంపై కన్నేసిన ఎమ్మెల్యే కుమార స్వామికి అసెంబ్లీ టికెట్ ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ సిటి రవి మద్దతుదారులు ఘెరోవ్(BS Yediyurappa Gherao) చేశారు.
మాజీ సీఎం యడ్యూరప్ప పార్లమెంటరీ బోర్డులో పదవిని కలిగి ఉండటంతో శికారిపుర నియోజకవర్గం నుండి తన కొడుకు పోటీ చేస్తాడని ప్రకటించడం ఈ వివాదానికి దారి తీసేలా చేసింది. దీనిపై ఇంకా హైకమాండ్ స్పందించలేదు.
Also Read : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి వరుణ్ షాక్