AP CM YS Jagan PM Modi : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
కీలక అంశాలపై చర్చ
YS Jagan PM Modi : ఢిల్లీలో ఏపీ సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్ ఆవరణలోని పీఎం ఆఫీసులో మోదీతో ములాఖత్ అయ్యారు జగన్ రెడ్డి. పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఎంపీలతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానమంత్రి మోదీకి(YS Jagan PM Modi) అందజేశారు.
అంతకు ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయాల్ ను కూడా కలుసుకున్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రం విభజన జరిగిన తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని వాపోయారు సీఎం.
ఇంకా అనేక అంశాలు పూర్తిగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖ మంత్రులను ఆదేశించాలని పీఎంను కోరారు సీఎం. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ. 36, 625 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని గుర్తు చేశారు. దీని వల్ల రాష్ట్రంలో పనులు పెండింగ్ లో ఉన్నాయని వాపోయారు.
గతంలో ఉన్న సర్కార్ అపరిమతంగా రుణాలు తీసుకుందని , దాని కారణంగా తమకు అప్పులు పుట్టకుండా పోయాయని పేర్కొన్నారు. దీనిపై కేంద్రం సానుకూల దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(YS Jagan).
ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేంద్రం సహకారం అందిస్తే మరింత ముందుకు వెళతామన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ. 2,600 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రికి విన్నవించారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
Also Read : మోదీ గురించి అలా అనలేదు