Akhilesh Yadav Mamata Banerjee : అఖిలేష్ దీదీ కొత్త ఫ్రంట్

బీజేపీ, కాంగ్రెస్ కు పోటీ

Akhilesh Yadav Mamata : కేంద్రంలోని మూడు కీల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్ , బీజేపీ రెండింటిని ఆమడ దూరంలో ఉంచేందుకు అంగీక‌రించాయి. రెండు పార్టీల‌ను స‌మానంగా చూసే విధానాన్ని తాము అనుస‌రిస్తామ‌ని సూచిస్తున్నాయి. శుక్ర‌వారం కోల్ క‌తాలో తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav Mamata) భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మార్చి 23న బిజూ జ‌న‌తా ద‌ల్ చీఫ్ ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌ల‌వ‌నున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మూమానికి కీల‌క నేత‌గా చూపించే బీజేపీ ప్ర‌య‌త్నాన్ని ఎదుర్కోవ‌డమే ఈ వ్యూహం ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల లండన్ లో ప్ర‌సంగించిన రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త పార్ల‌మెంట్ లో ప్ర‌తిక్ష నాయ‌కుల మైకుల‌ను ప‌ని చేయ‌కుండా చేస్తూ ప్ర‌జాస్వామ్య గొంతును వినిపించ‌కుండా చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఆయ‌న‌ను అడ్డం పెట్టుకుని త‌మ‌ను టార్గెట్ చేస్తున్నాయనే అభిప్రాయానికి ఇద్ద‌రు నేత‌లు వ‌చ్చారు. రాహుల్ విదేశాల్లో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పేంత దాకా బీజేపీ పార్ల‌మెంట్ ను న‌డ‌ప‌నీయ‌ద‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని సెంట‌ర్ గా బీజేపీ చేస్తోందంటూ టీఎంసీ ఆరోపిస్తోంది. విప‌క్షాల‌కు కాంగ్రెస్ బిగ్ బాస్ అనుకోవ‌డం పెద్ద తప్పు అన్నారు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ‌. కాంగ్రెస్ , బీజేపీకి స‌మాన దూరాన్ని పాటించాల‌ని తాము నిర్ణ‌యించామ‌న్నారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : రాహుల్ ఎందుకు క్ష‌మాపణ చెప్పాలి

Leave A Reply

Your Email Id will not be published!